మా పేస్ బౌలింగ్ తో అంత ఈజీ కాదు..టీమిండియాకు బాబర్ అజామ్ స్ట్రాంగ్ వార్నింగ్

మా పేస్ బౌలింగ్ తో అంత ఈజీ కాదు..టీమిండియాకు బాబర్ అజామ్ స్ట్రాంగ్ వార్నింగ్


ఆసియా కప్ లో భాగంగా రేపు ఆదివారం బ్లాక్ బస్టర్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ ఢీ కొనబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దాయాదుల సమరం గట్టిగానే జరిగేలా ఉంది.  శ్రీలంకలో జరుగుతున్న ఈ మ్యాచ్ కి కొలొంబోలోని ప్రేమదాస్ స్టేడియం ఆతిధ్యమివ్వబోతుంది. ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉన్నా.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ మ్యాచ్ కి రిజర్వ్ డేని కేటాయించారు.   
 
మా ఫాస్ట్ బౌలింగ్ ఆడలేరు

మ్యాచులో వీరిద్దరి సమరం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు సమరాన్ని ఇపుడే స్టార్ట్ చేసాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. మ్యాచ్ కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. " మా పేసర్ల ప్రదర్శన చూసి నేను గర్వపడుతున్నాను. పెద్ద మ్యాచ్‌లు, టోర్నమెంట్‌లను ఫాస్ట్ బౌలర్లే గెలిపిస్తారు. నాకు వారిపై చాలా నమ్మకం ఉంది. వారి విజయం వెనుక రహస్యం ఏమిటంటే వారు ఐక్యంగా ఉండి తమపై నమ్మకం కలిగి ఉంటారు. ఒకవేళ బౌలర్లు విఫలమైన ఆ బాధ్యతని మరొకరు పంచుకుంటారు". అని పాక్ కెప్టెన్ తెలిపాడు. 

ALSO READ :ప్రాక్టీస్ డుమ్మా కొట్టి షికారుకెళ్లిన క్రికెటర్లు.. పాక్ మ్యాచ్ కు ముందు ఇలానా
 
మరి లీగ్ మ్యాచులో పాక్ పేసర్లు మొదట్లో ఆధిపత్యం చూపించినా.. కిషాన్, హార్దిక్ పాండ్యను నిలువరించలేకపోయారు. దీంతో రెండు జట్లు కూడా సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచులో ఎవరి మీద ఎవరు ఆధిపత్యం చూపిస్తారో చూడాలి.