ఎక్స్​పైర్​ అయిన ఫుడ్‌ ఐటమ్స్​తో కుల్ఫీలు, బాదం పాలు తయారీ

ఎక్స్​పైర్​ అయిన  ఫుడ్‌ ఐటమ్స్​తో కుల్ఫీలు, బాదం పాలు తయారీ

ఘట్ కేసర్, వెలుగు: గడువు దాటిన ఫుడ్‌ ఐటమ్స్​తో కుల్ఫీలు, ఐస్‌ క్రీం, బాదం మిల్క్‌ తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని పోచారం ఐటీసీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోచారం ఐటీసీ ఇన్‌స్పెక్టర్‌‌ రాజువర్మ కథనం ప్రకారం.. చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్‌ షిప్‌ ఫేజ్‌ –2లో ఉంటున్న ఘన శ్యామ్‌ జాట్‌ (28) గడువు ముగిసిన కల్తీ ఆహార పదార్థాలతో  కుల్ఫీలు, ఐస్‌క్రీంలు, ఫ్రూట్‌ జ్యూస్‌, కూల్ డ్రింక్‌లు తయారు చేసి అమ్ముతున్నాడు.  

అతడి ఇంటిపై దాడి చేసి ఎక్స్​పైర్​ అయిన పౌడర్‌‌ బాక్సులు ఫ్రూటీ ప్యాకెట్లు, ఫుడ్ కలర్ జేమ్స్ బాటిల్,  బటర్ స్కాచ్ నట్స్  ప్యాకెట్లు, జెల్లీ బాక్సులు,  ఇలాచీ పౌడర్‌‌ బాక్సులు, సింథటిక్‌ సింటాక్‌ టిక్‌ సెమి లిక్విడ్ చాక్లెట్ బాక్స్​లు స్వాధీనం చేసుకున్నారు.  ఘన శ్యామ్‌ను అరెస్టు చేశారు.