గన్నేరువరం, వెలుగు: గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజీ నుంచి పొత్తూరు వరకు నిలిచిపోయిన డబుల్ రోడ్డు పనులను మొదలుపెట్టాలని యువజన సంఘాల లీడర్లు డిమాండ్ చేశారు. గన్నేరువరం మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గుండ్లపల్లి వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా యువజన సంఘాల లీడర్లు మాట్లాడుతూ సింగిల్ రోడ్డుతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎమ్మెల్యే కవ్వంపల్లి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆరు నెలల సమయంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని లేకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గెలిస్తే 15 రోజుల్లో రోడ్డు పనులు తిరిగి ప్రారంభిస్తానని మాటిచ్చిన ఎమ్మెల్యే.. అదే మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రతిఘటన ఎదురైందని గుర్తుచేశారు.
