గంగాధర, వెలుగు: గంగాధర మండలం నారాయణపూర్భూ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫొటోలకు కాంగ్రెస్ లీడర్లు మధురానగర్ చౌరస్తాలో ఆదివారం క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా గంగాధర మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. గంగాధరకు డిగ్రీ కాలేజీ, చొప్పదండిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎమ్మెల్యే కృషితోనే జరిగాయని, రానున్న రోజుల్లో చొప్పదండిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు.
