ఆధార్ కార్డ్ చాల ముఖ్యమైనది, ఇది మీకు తెలియని విషయం కాదు... అయితే ఆధార్ లేకుండా మీరు మీ KYCని పూర్తి చేయలేరు, అలాగే బ్యాంక్ అకౌంట్స్, ప్రభుత్వ పనులు చేయలేరు. ఆధార్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ఆధార్ కార్డ్‌పై మీ పేరులో తప్పు ఉంటే ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా...
మీరు ఆధార్ లో ఒకసారి మీ పేరులో తప్పులు ఉంటే మార్చుకోవచ్చు. కానీ మొదటి తర్వాత కూడా పేరులో తప్పులు ఉంటే, మీ ఆధార్ కార్డులో పేరును రెండోసారి మార్చుకోవచ్చా ? అసలు మీ ఆధార్ కార్డులో మీ పేరును ఎన్నిసార్లు మార్చవచ్చో.. దీనికి ఏ పేపర్స్ అవసరం....
మీ పేరును ఎన్నిసార్లు మార్చుకోవచ్చు:
మీ ఆధార్ కార్డులో వ్యక్తిగత సమాచారాన్ని, పేరు, అడ్రస్ వంటి వివరాలను సరిచేసుకోవాలంటే UIDAI కొన్ని రూల్స్ పెట్టింది. ఈ నియమాల ప్రకారం, మీరు మీ ఆధార్ కార్డులో మీ పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు. స్పెల్లింగ్ తప్పులను సరిదిద్దడం, పేర్ల వరుస మార్చడం లేదా పెళ్లి తర్వాత ఇంటి పేరును అప్ డేట్ చేయడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఈ మార్పులకు రూ.50 కడితే సరిపోతుంది, కానీ ఒకసారికి రెండు ఫీల్డ్‌లను మాత్రమే అప్ డేట్ చేసికోవచ్చు.
మీరు మూడవసారి మీ పేరును మార్చుకోవాలంటే : మీరు మూడవసారి మీ పేరును మార్చుకోవాల్సిన అవసరం ఉంటే, మీరు ప్రత్యేక అనుమతి పొందాలి అలాగే సరైన కారణాన్ని చెప్పాలి
ఆధార్ కార్డులో పేరును ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలి: మీ ఆధార్ కార్డులో పేరులో తప్పులు సరిచేయడానికి మీరు ఇకపై ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని మీ ఇంటి నుండే నుండే ఆన్‌లైన్‌లో చేయవచ్చు. మీ ఆధార్ కార్డులో మీ పేరును ఎలా మార్చాకోవాలంటే.......
ముందుగా UIDAI అఫీషియల్ వెబ్‌సైట్ (https://uidai.gov.in) కి వెళ్లండి.
* “My Aadhaar” విభాగానికి వెళ్లి “update Your Aadhaa” పై క్లిక్ చేయండి.
*ఇప్పుడు “Update Demographics Data Online” పై క్లిక్ చేయండి.
*మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
*మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP ( One Time Password) వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి
*ఇప్పుడు "Name" సెలెక్ట్ చేసుకొని, కొత్త పేరును ఎంటర్ చేయండి.
*మీ కొత్త పేరు నిరూపించే అవసరమైన ప్రూఫ్స్ అంటే పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా అప్‌లోడ్ చేయండి.
*చేసిన తర్వాత, మీకు URN (అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్) వస్తుంది. దీని ద్వారా మీరు మీ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
మీ ఆధార్ కార్డులో మీ పేరు మార్చుకోవడానికి ఎం అవసరమంటే : మీ పేరును మార్చడానికి, మీరు బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ లేదా ప్రభుత్వం ఆమోదించిన పుట్టిన తేదీ ప్రూఫ్ అందించాలి. పేరు మార్పు అవసరాన్ని నిరూపించే గెజిట్ నోటిఫికేషన్, మ్యారేజ్ సర్టిఫికెట్, కోర్టు ఉత్తర్వు లేదా ఇతర చట్టపరమైన డాకుమెంట్స్ కూడా చెల్లుతాయి లేదా లిస్ట్ కోసం మీరు UIDAI వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.
