నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నిత్యజీవితంలో  యోగాను భాగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, వెలుగు: యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం రామడుగు మండలం వెలిచాలలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్​ రాష్ట్రస్థాయి యోగా పోటీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో బలం, సమతుల్యత పెరిగి ఒత్తిడి తగ్గుతుందన్నారు. యోగాతో మనిషికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. అనంతరం ట్రెడిషనల్, ఆర్టిస్టిక్,  రిథమిక్ ఫెయిర్, ఆర్టిస్టిక్ ఫెయిర్ విభాగాల్లో గెలుపొందిన బాలబాలికలకు విడివిడిగా పతకాలు అందజేశారు. మాజీ ఎంపీపీ నర్సింగరావు, సీవీవీఎం హాస్పిటల్​ చాట్ల శ్రీధర్​, స్కూల్​ హెచ్ఎం రాజరాజేశ్వరి, స్కూల్ గేమ్స్ సెక్రటరీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

బోయినిపల్లి, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినిపల్లి మండలం మల్లాపూర్ లో ఐల శివరాం కొత్తగా ఇల్లు నిర్మించుకోగా ఆదివారం ప్రారంభించారు. మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.