నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీ సింగ్?

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీ సింగ్?

నేపాల్ జెన్ జెడ్ నిరసకారుల్లో చీలిక వచ్చిందా..? తాత్కాలిక ప్రధాని ఎంపిక విషయంలో వారిమధ్యం భిన్నాభిప్రాయాలు తలెత్తాయా? ఇప్పటికే జెన్ జెడ్ గ్రూప్ ప్రతిపాదించిన సుశీలా కర్కీని ఓ వర్గం వ్యతిరేకించిందా? అంటే అవుననే అనిపిస్తోంది..నేపాల్ తాత్కాలిక ప్రధానిగా విద్యుత్ అథారిటీ మాజీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్‌ పేరును జెన్ జెడ్ గ్రూప్ తెరపైకి తెచ్చింది.

జన్ జెడ్ నిరసనకారుల బృందం గురువారం(సెప్టెంబర్11) నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి కొత్త అధిపతిగా విద్యుత్ అథారిటీ మాజీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్‌ను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నామినేట్ చేయడాన్ని ఓ వర్గం వ్యతిరేకించడంతో ఆమె నియామకంపై ఏకాభిప్రాయం కుదరలేదు.ఇది నిరసనకారులలో చీలికను సూచిస్తోంది. 

సైన్యం పహారాలోనే  ఖాట్మాండు..

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.జెన్ జెడ్ తరపున ఆయన పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనకు అన్నివర్గాల మద్దతు తెలిపాయి. మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, ఖాట్మాండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేర్లు వినిపించాయి. 

వీరిలో కర్కి నేపాల్ సుప్రీంకోర్టుకు తొలి మహిళా సీజేగా నిలిచారు. బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేసి, యువతలో క్రేజ్ సం పాదించారు. ప్రభుత్వ అవినీతి వ్యతిరేకంగా చెలరేగిన హింస ఇప్పుడు కొంత సద్దుమణిగింది. 

ఈ నెల 9న జరిగిన ఘర్షణల్లో ప్రాణన ష్టం, ఆస్తినష్టం ఎక్కువవడంతో ప్రధానమం త్రి కేపీ శర్మ ఓలి సహా పలువురు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే సైన్యం రంగంలోకి దిగి కర్ఫ్యూ అమలు చేస్తూ, కాఠ్మాండూ వీధుల్లో పహారా కాస్తోంది.