ఆరు గ్యారెంటీలతో అందరికీ లబ్ధి : కుంభం అనిల్​కుమార్​రెడ్డి

ఆరు గ్యారెంటీలతో అందరికీ లబ్ధి : కుంభం అనిల్​కుమార్​రెడ్డి
  • కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో ప్రజలందరికీ లబ్ధి కలుగుతుందని ఆ పార్టీ  భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​రెడ్డి చెప్పారు. ఆదివారం నియోజకవర్గంలోని బీబీనగర్​, భువనగిరి మండలాల్లోని పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీఆర్​ఎస్​ నెరవేర్చలేదని విమర్శించారు.

ALSO READ : కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం: సరిత

కాంగ్రెస్​ గెలిస్తే ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని వెల్లడించారు. కర్నాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రచారం సందర్భంగా బీఆర్​ఎస్​కు చెందిన పలువురు లీడర్లు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్​లో చేరారు.