
ఆసిఫాబాద్, వెలుగు: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కుమ్రంభీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.40 మీటర్లకు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 947 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో ఆదివారం ఒక గేటును పైకి ఎత్తి 620 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. పెద్దవాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.