
జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్ఎమ్మెల్యే వివేకానంద్‌ను మరోసారి నమ్మి మోసపోవద్దని కుత్బుల్లాపూర్బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో భూ కబ్జాలు,సెటిల్మెంట్లు, దందాలతో ఎమ్మెల్యే, అతని అనుచరులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ప్రజలు నమ్మకంతో రెండు సార్లు గెలిపిస్తే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.
100 పడకల ఆస్పత్రి, జగద్గిరిగుట్ట బస్ డిపో, టిమ్స్ ఆస్పత్రి ఏమైందని ప్రశ్నించారు. ఒక్క కొత్త రేషన్‌కార్డు, కొత్త ఫించన్ఇవ్వలేదన్నారు. డబుల్ ఇండ్లకు లక్షమంది దరఖాస్తులు చేస్తే ఒక్కరికి కూడా పొజిషన్ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 30న జరిగే పోలింగ్‌లో బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.