కుంటాల ఫాల్స్‌కు జల కళ.. వెళ్లొద్దాం పదపద!

కుంటాల ఫాల్స్‌కు జల కళ.. వెళ్లొద్దాం పదపద!

ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ జలపాతం కుంటాల కొత్తశోభను  సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న  వర్షాలతో జలపాతానికి కళ వచ్చింది. దీంతో .. కడెం పరివాహకంలోని నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతాన్ని  చూసేందుకు  క్యూ కడుతున్నారు  పర్యాటకులు.

దాదాపు నాలుగైదు  నెలల  తర్వాత  కుంటాలకు  నీరు  వస్తోంది. దీంతో..తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖమైన ఈ జలపాతం చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. ప్రకృతి  ఒడిలో  సేదతీరుతూ  ఎంజాయ్ చేస్తున్నారు.