కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కురుమ యువ చైతన్య సమితి

కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కురుమ యువ చైతన్య సమితి

ముషీరాబాద్, వెలుగు: కురుల జాతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగ నరసింహ కురుమ డిమాండ్ చేశారు. ఆదివారం (నవంబర్ 0) బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలన్నారు.  కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు ప్రకటించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కౌడ పోచయ్య కురుమ, లీగల్ అడ్వైజర్ ప్రసన్న కమార్, మహేందర్, వెంకటేశ్, సత్యనారాయణ, రమేశ్, బండారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.