
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ MPDO ఆఫీస్ ముందు ధర్నా చేశారు KVBS గురుకుల పాఠశాల విద్యార్థినిలు. హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో పాటు సరైన భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు వచ్చినా SO పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో MPDO ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని SO అర్చనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.