కీసర దిక్కు ప్లాట్లకు ఫుల్‌‌ డిమాండ్‌‌

కీసర దిక్కు ప్లాట్లకు ఫుల్‌‌ డిమాండ్‌‌
  • అందుబాటు ధరల్లో కేవీఆర్ ఓపెన్ ప్లాట్లు
  • ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రియల్ స్వరూపం మారింది
  • ‘వెలుగు’తో కేవీఆర్ కన్ స్ట్రక్షన్ ఎండీ కె.వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:

ఔటర్ రింగు రోడ్డుతోనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతోంది. సిటీలో పుట్టి పెరిగినవాళ్లు కూడా ప్రస్తుతం శివారు ప్రాంతాల వైపు వెళ్తున్నారు. ఇప్పటికిప్పుడు రెసిడెన్షియల్ సెగ్మెంట్ ఓఆర్ఆర్ ఉన్న అన్ని ప్రాంతాల్లో వృద్ధి చెందకపోయినా, రానున్న రోజుల్లో మాత్రం ప్రస్తుతం కంటే శరవేగంగా మార్పు చెందుతుంది. దీనికితోడు సిటీ నలుమూలలా ట్రాన్స్ పోర్ట్, సోషల్ ఇన్ ఫ్రా అందుబాటులోకి వస్తుండటంతో కోర్ సిటీలోనే ఉండాలనే భావన క్రమంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఓఆర్ఆర్ ప్రాంతం, వరంగల్ హైవే పరిసరాల్లో ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఉండే స్థిరాస్తిని కొనుగోలు చేసుకునేందుకు విస్తృతమైన ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. ఓపెన్ ప్లాటింగ్, ఇండిపెండెంట్ విల్లాలకు మంచి డిమాండ్ ఉంది. భూముల రేట్లు తక్కువగా ఉండటంతో శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోందని.. ఈస్ట్ సిటీ రియల్ ట్రెండ్ పై కేవీఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. వెంకట్ రెడ్డి ‘వెలుగు’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

జీపీ లేఔట్లతో సమస్యలొస్తున్నయ్

13 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం. ఎక్కువగా ఓపెన్ ప్లాటింగ్ లోనే వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటివరకు 9  ప్రాజెక్టులు పూర్తి చేశాం. తొలినాళ్లలో జీపీ లేఔట్లకు ప్రాధాన్యత ఇచ్చినా.. ప్రస్తుతం హెచ్ఎండీఏ అప్రూవ్డ్ వెంచర్లను రూపొందిస్తున్నాం. జీపీ లేఔట్ల రెగ్యులరైజేషన్, నిర్మాణ అనుమతుల కోసం ఎదురవుతున్న ఇబ్బందులు, ఫైనాన్స్ వంటి అంశాలు సమస్యగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే  గ్రామ పంచాయతీ లేఔట్ల కంటే హెచ్ఎండీఏ ప్రాజెక్టులను మాత్రమే డెవలప్ చేస్తున్నాం. ప్రస్తుతం రెసిడెన్షియల్ మార్కెట్ కంటే ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు మార్కెట్ ఉంది. ఏడాది, రెండేళ్లలోనే పెట్టుబడికి 10–25శాతం మేర ధరలు పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఉండేవారే కాకుండా ఇతర జిల్లాలకు చెందినవారు కూడా ఓపెన్ ప్లాట్లు కొంటున్నారు.

కేవీఆర్ ల్యాండ్ మార్క్ లో 320 ప్లాట్లు

కొత్త జిల్లాల ఏర్పాటు, ఓఆర్ఆర్ వరకు రవాణా, విద్యా సంస్థలు విస్తరించడంతో.. కీసర, మేడ్చల్ వంటి ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. విశాలమైన ల్యాండ్ బ్యాంక్, విద్యా సంస్థలకు చేరువలో ఉండటంతో కీసర రియల్ వ్యాపారానికి కేంద్రంగా మారింది. ఇప్పుడు కీసర పరిధిలో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8కి 100 మీటర్ల దూరంలో ఓపెన్ వెంచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. కేవీఆర్ ల్యాండ్ మార్క్ పేరిట 170 చదరపు గజాల విస్తీర్ణంలో 320 ప్లాట్లను డెవలప్ చేశాం. ఇప్పటికే 70 శాతం ప్లాట్లను విక్రయించాం. విశాలమైన రోడ్లు, పార్కులు, సోషల్ ఇన్ ఫ్రా, సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో జీవనం గడపాలనుకునేవారు కీసర వైపు వస్తున్నారు.

కోర్ సిటీ నుంచే ఎక్కువ

ఓఆర్ఆర్, సిటీ శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం భూముల ధరలు తక్కువగా ఉండటంతో… ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలకు చెందినవారే కాకుండా కోర్ సిటీ నుంచి వచ్చి మరీ ఫ్యూచర్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కొనుగోలు చేస్తున్నారు. గత రెండేళ్లలో మార్కెట్ కూడా బాగా పుంజుకుంది. భూముల ధరలు పెరుగుతుండటంతో… సొంతిల్లు ఉండి, పెట్టుబడి మార్గాల కోసం చూసేవారికి కేవీఆర్ ల్యాండ్ మార్క్  ద్వారా మరింత త్వరగా లాభాలు ఆర్జించవచ్చు. గత ఏడాది కాలంగా మార్కెట్ కొంచెం ఊగిసలాడుతున్నా… హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్‌‌‌‌లో పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేదు.

ఓఆర్ఆర్ చుట్టూ 50 ఎకరాల్లో ప్లాట్లు…

ఇప్పటివరకు కేవీఆర్ నుంచి 50 ఎకరాల్లో ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. 10 ఎకరాల్లో గ్రీన్ పార్క్ హెచ్ఎండీఏ లేఔట్, 7ఎకరాల్లో హ్యాపీ హోమ్స్, బోగారం వద్ద 10 ఎకరాల్లో కేవీఆర్ కన్ స్ట్రక్షన్, 20 ఎకరాల విస్తీర్ణంలో కేవీఆర్ టౌన్ షిప్ పేరిట రెసిడెన్షియల్ ప్లాట్లతోపాటు లగ్జరీ విల్లా ప్లాట్లను తీర్చిదిద్దాం.

ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మారిన రియల్ తీరు

ఓఆర్ఆర్​కు ముందు, ఓఆర్ఆర్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ను చూడాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డుతో  సోషల్ ఇన్​ఫ్రా, రోడ్లు, వసతులు పెరగడంతో రియల్ వ్యాపారం కూడా పుంజుకుంది. ఏటేటా అనుకున్న దానికంటే భూముల ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సిటీ నుంచి దాదాపు 10 నుంచి 15 కి.మీ. దూరంలో.. 158 కి.మీ పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ నుంచి ఎక్కడికైనా చేరుకునే వెసులుబాటు దొరికింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఇంటి నుంచి వర్కింగ్ ప్లేసులకు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులన్నీ ఓఆర్ఆర్ కు రెండు కి.మీ పరిధిలోనే డెవలప్ చేశాం.