కాంగ్రెస్ పార్టీలోకి క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

కాంగ్రెస్ పార్టీలోకి క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ దిశగా పయనిస్తుంది. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపల్చైర్మన్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డితో సహా ఐదుగురు  కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ హస్తగతం అయినట్లే. 

కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి.. కాంగ్రెస్ పార్టీ అమలు ఆరు గ్యారంటీలతో ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందని.. ప్రజల అభీష్టం మేరకు.. బీఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు మున్సిపల్ చైర్మన్ జంగం కళ. వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి. పార్టీలోకి వచ్చిన క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో ప్రజాదరణ రోజురోజు పెరుగుతుందని స్పష్టం చేశారాయన. 

 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన బీఆర్ఎస్ పార్టీ కి రోజుకో షాక్ తగులుతుంది. రోజుకో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ ల పై అవిశ్వాసాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని అవిశ్వాసాల్లో కాంగ్రెస్ పార్టీ బల పరిచిన అభ్యర్థులు చైర్మన్ లుగా ఎన్నికవుతున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్ పల్లి  మున్సిపల్ చైర్మన్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డితో సహా ఐదుగురు  కౌన్సిలర్లు  బీఆర్ఎస్ పార్టీని వీడారు.