కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్సమావేశంలో పలు అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేశారు. శనివారం మున్సిపల్ఆఫీస్లో చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. రూ.5లక్షలతో కోతులను పట్టడం, వాటర్సప్లై, స్ట్రీట్లైటింగ్, రిపేర్లు, సామగ్రి కొనుగోలుకు రూ.60వేలు, సానిటేషన్ నిర్వహణ కోసం రూ.2లక్షలు, శానిటేషన్పనులు చేసే వాహన డ్రైవర్లు, కూలీలకు రూ.4లక్షల నిధులను చెల్లించే తదితర తీర్మానాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్తో కలిసి చైర్పర్సన్కొత్తగా కొనుగోలు చేసిన నాలుగు స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ సరిత, రెవెన్యూ ఆఫీసర్సతీశ్, డీఈ సుమతి, ఏఈ ఆశ్రిత్ తదితరులు పాల్గొన్నారు.
