క్యాసినో కేసు : ఎల్. రమణకు యశోదలో కొనసాగుతున్న ట్రీట్మెంట్

క్యాసినో కేసు : ఎల్. రమణకు యశోదలో కొనసాగుతున్న ట్రీట్మెంట్

క్యాసినో వ్యవహారంలో విచారణకు హాజరై అస్వస్థతకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణను యశోద హాస్పిటల్ కు తరలించారు. ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనను హైదర్గూడలోని అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. గతంలో యశోద వైద్యులు ఆయనకు స్టంట్ వేసినందున ఆ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే క్యాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణకు గతంలోనే  ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో ఆడేందుకు ఆయన విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలుండటంతో విచారణ నిమిత్తం రమణ ఇవాళ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసుకు వెళ్లగా స్వల్ప అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్కు తరలించారు.