ల్యాబ్ టెక్నీషియన్ మృతి కేసులో నర్స్ సృజన అరెస్ట్

ల్యాబ్ టెక్నీషియన్ మృతి కేసులో నర్స్ సృజన అరెస్ట్

కడప: గత రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసులు కేసును పోలీసులు చేధించారు. నగరంలోని ఓ నర్సింగ్ హోంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న శ్రీనివాసులు కు అదే ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తున్న సృజనతో వివాహేతర సంబంధం ఉంది.  అయితే సృజన మరో యువకుడితో వివాహానికి సిద్దపడడంతో.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక శ్రీనివాసులు.. ఆత్మహత్య చేసుకుంటానని సృజనను బెదిరించేవాడు. వేధింపులకు గురి చేసేవాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నర్సింగ్ హోమ్ లో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రూమ్ లోకి వెళ్ళి చీర బిగించుకోని ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసులు బెదిరించాడు. ఇద్దరి మద్య పెనుగులాట చోటు చేసుకోవడంతో చీర బిగుసుకోని శ్రీనివాసులు మృతి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి శనివారం సృజన అరెస్ట్ చేశారు. చిన్నచౌకు పోలీస్ స్టేషన్ లో నిందితురాలిని మీడియా ఎదుట హాజరు పరచి సిఐ అశోక్ రెడ్డి వివరాలు వెల్లడించారు.