వెట్టిచాకిరి చేయిస్తున్రు..కూలీల ఆవేదన

వెట్టిచాకిరి చేయిస్తున్రు..కూలీల ఆవేదన

పెద్దపల్లిలో ఇటుక బట్టి యజమాని తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడని కొందరు ఒడిశా కూలీలు  ఆవేదన వ్యక్తం చేశారు.  ఎక్కువ సేపు పని చేయించుకొని తక్కువ జీతం ఇస్తున్నాడని వీడియో తీసి ఒడిశా సర్కార్ కు పంపించారు. అనారోగ్యంగా ఉన్న తమను ఆస్పత్రికి వెళ్లనివ్వడం లేదని రింకు బెహరా అనే యువకుడు తమ బాధను వెల్లడించాడు. తమను ఆదుకోవాలంటూ కూలీలు వేడుకున్నారు.

అయితే ఆ వీడియో చూసిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మార్వో వెంకటలక్ష్మీ విచారణ జరిపించారు. కార్మిక శాఖ అధికారులతో కలిసి ఈ రోజు పూర్తిగా విచారించి కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నారు.