ODI World Cup 2023: అదరగొట్టిన ఆసీస్.. ఇంగ్లాండ్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ODI World Cup 2023: అదరగొట్టిన ఆసీస్.. ఇంగ్లాండ్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

వరల్డ్ కప్ కీలక మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. సెమీస్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు ఛాలెంజిగ్ టార్గెట్ సెట్ చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. 71 పరుగులకు చేసిన లబుషేన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్మిత్ 44, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ కు ఓపెనర్లు తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. చివరి మ్యాచ్ సెంచరీ హీరో హెడ్ 11 పరుగులు చేస్తే వార్నర్ 15 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో లబుషేన్ కు జత కలిసిన స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మూడో వికెట్ కు 75 పరుగులు జోడించిన తర్వాత స్మిత్ 44 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వారు అడపాదడపా స్కోర్ చేసినా ఎవ్వరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. 

చివర్లో స్టార్క్, జంపా భాగస్వామ్యంతో ఆసీస్ 280 పరుగుల మార్క్ అందుకుంది. వీరిద్దరూ 9 వ వికెట్ కు 38 పరుగులు జోడించారు. జంపా 29 పరుగులు చేస్తే స్టార్క్ 10 పరుగులు చేసాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రషీద్, మార్క్ వుడ్   తలో రెండు వికెట్లు లభించగా.. డేవిడ్ విల్లీ, లివింగ్ స్టోన్ చెరోవికెట్ తీసుకున్నారు.