- సీఈవోకు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ వినతి
హైదరాబాద్, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాములు, కార్యదర్శి రమేశ్ పాక కోరారు. బుధవారం రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్‌ను రెండు అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందచేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి న బడ్జెట్ మంజూరైనప్పటికీ నేటికి అందలేదని గుర్తుచేశారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫీకేషన్ సైతం వచ్చిందన్నారు. బడ్జెట్ లేకపోవడంతో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. పాత బడ్జెట్‌ను వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
