వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు లేక  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ల కోసం క్యూ లైన్ లలో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని  పేషెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ తీసుకునే దగ్గర కూడా స్టాఫ్ ఆలస్యం చేస్తున్నారన్నారు. కరెంట్ లేదని, ఇంటర్నెట్ రావడం లేదని చెబుతున్నారని, బయటికొచ్చాక డాక్టర్లు లేకపోవడం వల్ల మరింత ఎక్కువ సమయం ఎదురుచూడాల్సి వస్తోందని అంటున్నారు. ఓపీ చీటీ కూడా కంప్యూటరైజ్డ్ ది కాకుండా మామూలు చీటీలో రాసి ఇస్తున్నారని ఆస్పత్రి కి వచ్చిన పబ్లిక్ చెబుతున్నారు. 

సమయానికి ఆస్పత్రికి డాక్టర్లు రాకపోవడంతో పేషెంట్స్ క్యూ లైన్ లలో నిలబడి, పడిగాపులు కాస్తున్నారు. ఈ లైన్లలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉండడం గమనార్హం. దీంతో దవాఖానకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు ఈ ఆస్పత్రిలో వైద్యులున్నా చాలా మంది డిప్యుటేషన్ పై వెళ్లడం, మరికొందరు సమయానికి రాకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.