
లడ్డూలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ వాటిని తయారు చేయడం రాక కొందరు... వచ్చినా టైమ్ లేక ఇంకొందరు లడ్డూలు చేయడాన్ని పెద్ద పనిగా భావిస్తారు. అందుకే బయటికెళ్లి షాపుల్లో తెచ్చుకుని తింటారు. అలాకాకుండా ఇంట్లోనే నిమిషాల్లో లడ్డూలు చేసుకోవచ్చు. పైగా ఆరోగ్యానికి ఎంతో మేలైన శెనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పులతో చేసేయొచ్చు. చాలా సింపుల్గా , టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. . .!
బేసిన్ లడ్డూ తయారీకి కావలసినవి
- శెనగపిండి: ఒకటిన్నర కప్పు శెనగపప్పును దోరగా వేగించి పొడి చేసుకోవచ్చు)
- చక్కెర పొడి: ముప్పావు కప్పు
- ఇలాచీ పొడి: పావు టీ స్పూన్
- నెయ్యి: ఒక కప్పు
- డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్) : పావు కప్పు
- కుంకుమ పువ్వు: చిటికెడు
పెసరపప్పు లడ్డూ తయారీకి కావలసినవి
- పెసరపప్పు: ఒక కప్పు
- చక్కెర: ఒక కప్పు
- బియ్యం: అర కప్పు
- పల్లీలు: అర కప్పు
- జీడిపప్పు: ఆరు
- బాదం పలుకులు: ఒక టేబుల్ స్పూన్
- నెయ్యి: ఒక కప్పు
తయారీ విధానం : స్టవ్ పై పాన్ పెట్టి పెసరపప్పు, బియ్యం,పల్లీలు ఒకదాని తర్వాత ఇంకోటి నెయ్యి లేకుండా వేగించాలి. వాటన్నింటినీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. అలాగే జీడిపప్పు, బాదం పలుకులను విడిగా నెయ్యిలో వేగించాలి. మళ్లీ స్టవ్ పై పాన్ పెట్టి అరకప్పు నెయ్యి వేడి చేసి, పప్పు పొడిని పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. చక్కెరను కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత పెద్ద గిన్నెలో వేగించిన పొడి, జీడిపప్పు, బాదం పలుకులు, చక్కెర పొడి వేసి కలపాలి. పిండి బాగా పొడిగా అనిపిస్తే కొన్ని గోరువెచ్చని పాలు కలపొచ్చు. చేతులకు నెయ్యి రాసుకుని, చిన్న చిన్న ఉండలు చేయాలి. ఇలా చాలా సులువుగా పెసరపప్పు లడ్డూని తయారుచేయొచ్చు
►ALSO READ | Snacks Time : పొటాటో పాన్ కేక్స్.. లొట్టలేస్తూ లాగించేస్తారు.. ఎలా తయారు చేయాలంటే..!
సున్నుండలు తయారీకి కావలసినవి
- మినప్పప్పు: ఒక కప్పు
- బెల్లం తరుము లేదా చక్కెర పొడి: ఒక కప్పు
- నెయ్యి: అర కప్పు
తయారీ విధానం : స్టవ్ పై పాన్ పెట్టి మినప్పప్పును సన్నని మంటపై వరకు వేగించాలి. పప్పు పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అందులోనే బెల్లం తురుము కూడా వేసి ఇంకో రౌండ్ గ్రైండ్ చేయాలి అలాచేస్తే పప్పు పొడి, బెల్లం బాగా కలుస్తాయి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి మిశ్రమాన్ని తీసుకోవాలి. అందులో కరిగించిన నెయ్యి వేసి కలపాలి. చేతులకు కూడా నెయ్యి అద్దుకుని ఉండలు చేయాలి. వీటిని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తింటారు.
వెలుగు, లైఫ్