మొబైల్ చోరీకి పాల్పడిన కిలాడీ లేడీ అరెస్ట్

మొబైల్ చోరీకి పాల్పడిన కిలాడీ లేడీ అరెస్ట్

ఢిల్లీ:  దొంగ మొబైల్ చోరీకి పాల్పడిన కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటన ఢిల్లీలో జరుగగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ అమ్మాయి మొబైల్ చోరీకి ట్రై చేసి అడ్డంగా దొరికిపోయింది. సింపుల్ గా నడుచుకుంటూ వెళ్లి.. గల్లీలో నుంచి వెళ్తున్న మరో అమ్మాయి చేతిలో ఉన్న మొబైల్ లాగింది. అయితే బాధితురాలు ఆమెపై తిరగబడింది. దాంతో లేడీ దొంగ ఆమెను కొట్టి అక్కడి నుంచి జంప్ అయింది. బాధితురాలు ఫిర్యాదుతో సీసీ ఫుటేజీ ఆధారంగా లేడీ దొంగను పట్టుకున్నారు పోలీసులు.