
‘నీ కూతురి మృతికి నేనే కారణం.. నీకు చేతనైంది చేసుకో’
హైదరాబాద్ ప్రియాంక ఘటన మరువకముందే అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. కాలిన గాయాలతో చనిపోయిన 20 ఏళ్ల యువతి మృతదేహం కాంచీపురంలోని ఒక తోటలో లభించింది. ఆ ఘటనకు సంబంధించి 24 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వలజాబాద్ సమీపంలోని ఆండి సిరువల్లూరు గ్రామానికి చెందిన యువతి.. పక్క ఊరులో ఉండే రాజేష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. రాజేష్ ఎక్కువ కులానికి చెందిన వాడు కావడంతో రాజేష్‌ను మరచిపోవాలని ఆమె తండ్రి హెచ్చరించాడు. కాగా.. యువతి ఈ నెల 21న పని మీద బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. రెండు రోజుల పాటు కూతురిని వెతికిన ఆమె తల్లిదండ్రులు నవంబర్ 23న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా.. యువతి ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు ఆమె ఇంటికి సమీపంలో ఉన్న ఒక తోటలో నవంబర్ 27, బుధవారం కాలిన గాయాలతో ఉన్న ఆమె మృతదేహం పోలీసులకు లభించింది. అంతేకాకుండా ఆమె శరీరంపై అక్కడక్కడా గాయాలు కూడా ఉన్నట్లు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. రాజేష్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువతి తప్పిపోయిన రోజు ఆమెని ఇంటి వద్ద దింపినట్లు రాజేష్ తెలిపాడు. కానీ, ఆ రోజు ఆమె ఇంటికి రాలేదు. దాంతో రాజేష్‌ని నిలదీయగా.. నీ కూతురు కనిపించకపోవడానికి, నాకు ఎటువంటి సంబంధం లేదని రాజేష్ వాదించాడు. కాసేపటి తర్వాత ‘నీ కూతురుకు ఏమైనా నేనే కారణం.. ఏం చేసుకుంటావో చేసుకోపో’ అన్నాడని యువతి తండ్రి పోలీసులకు చెప్పాడు. యువతి తప్పిపోయినప్పుడు ఆమె రాజేష్‌తోనే ఉన్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు.
పోలీసులు రాజేష్‌పై ఐపీసీ సెక్షన్ 306 మరియు ఎస్సీ/ఎస్టీ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె చనిపోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయం పోస్ట్ మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.
హైదరాబాద్‌లో డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటన జరిగి 24 గంటలు గడవకముందే తమిళనాడులో అలాంటి ఘటనే పునరావృతం కావడంతో.. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తల కోసం..