2.5 తులాలు దొంగిలించిన లేడీ చైన్‌‌ స్నాచర్‌‌

2.5 తులాలు దొంగిలించిన లేడీ చైన్‌‌ స్నాచర్‌‌
  • రాజేంద్ర నగర్ పరిధిలో ఘటన

గండిపేట, వెలుగు: ఓ లేడీ చైన్ స్నాచర్ చేతి వాటం చూపించింది. శనివారం ఉదయం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఉప్పర్ పల్లి ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు తన ఇంటి బయట కూర్చొని ఉంది. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపింది. వృద్ధురాలి మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును దొంగిలించింది. ఆ స్నాచర్ ను ప్రతిఘటించేందుకు వృద్ధురాలు ప్రయత్నించి విఫలమైంది. వెంటనే తేరుకున్న వృద్ధురాలు బిగ్గరగా దొంగదొంగా అని అరిచింది. ఇది గమనించిన స్థానికులు చైన్ స్నాచర్ కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.