
తిరుపతి: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరోసారి కారు జోరు కొనసాగనుందని మాజీ ఎంపీ లగడపాటి తెలిపారు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం తన ఎన్నికల సర్వే వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం 17 స్థానాలకి గానూ 15 నుంచి 16 లోక్ సభ స్ధానాలను గెలుచుకుంటుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ 0-2, బీజేపీ 0-1, ఎంఐఎం 0-1 స్థానం గెలుచుకుంటుందని ప్రకటించారు.