ఆధార్ సవరణలకు స్పెషల్ క్యాంపులు.. జన సంద్రంగా కొత్తగూడెం కలెక్టరేట్!

ఆధార్ సవరణలకు స్పెషల్ క్యాంపులు.. జన సంద్రంగా కొత్తగూడెం కలెక్టరేట్!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​ బుధవారం జన సంద్రంగా మారింది. ఆధార్​ కార్డులో సవరణలు చేసుకునేందుకు వీలుగా బుధ, గురువారాల్లో కలెక్టరేట్​లో స్పెషల్​ క్యాంపులను ఏర్పాటు చేయడంతో మొదటి బుధవారం కలెక్టరేట్​కు  ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలను అదుపు చేసే క్రమంలో కలెక్టరేట్​ గేట్లను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్​ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 28 కౌంటర్లు పెట్టారు. 

ప్రతీ కౌంటర్​ వద్ద వందలాదిగా ప్రజలు క్యూలో నిలబడ్డారు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లులతో పాటు వృద్దులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని కలెక్టర్​ సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా క్యాంపులు పెడుతామని అడిషనల్​ కలెక్టర్​ పేర్కొన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈసురోమంటూ తిరిగి వెళ్లిపోయారు.