
కల్వకుర్తి, వెలుగు: వెల్దండ మండలంలో మూడేళ్ల బాలుడు 3 గంటల పాటు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చదురువల్లి గ్రామానికి చెందిన పోలే నరేందర్, నీలమ్మ దంపతులకు రిషి, రిత్విక్(3) ఇద్దరు కొడుకులు. బుధవారం తాత వెంట పిల్లలు బయటికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత రుషి మాత్రమే ఇంటికి చేరుకోగా, రిత్విక్ కనిపించలేదు.
గ్రామంలో ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై కురుమూర్తి సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు. 3 గంటల తరువాత పంట చేలల్లో బాలుడు పోలీసులకు దొరకగా, తల్లిదండ్రులకు అప్పగించారు.