
పాకిస్థాన్: లాహోర్ నగరంలో బాంబుల మోత దద్దరిల్లుతోంది. భారత.. పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్ లోని ప్రధాన నగరమైన లాహోర్ లోని మూడు ప్రధాన సెంటర్లలో బాంబు పేలుళ్లు సంభవించాయి. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతాధికారులు చుట్టుముట్టి.. ఆ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు పాక్ అధికారులు తెలిపారు.
పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ( మే 8) ఉదయం 7 గంటలకు పేలుళ్లు సంభవించాయి. వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్.. నసీరాబాద్ ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి పారిపోతున్నట్లు అక్కడి సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయని పాక్ మీడియా తెలిపింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గాలిలోకి భీంకరంగా పొగలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Lahore three explosion heard at Pakistan military airport in Walton area.
— Faraz Pervaiz (@FarazPervaiz3) May 8, 2025
1122 Rescue firefighting vehicles reached the scene. pic.twitter.com/OKVStcgxIE
ఈ ఘటన తరువాత సైరన్ మోగడంతో పోలీసలు.. ఫైర్‌సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుళ్లు సంభవించి ప్రాంతం లాహోర్ లోని నాగరిక జిల్లా వ్యాపార కేంద్రంగా ఉంది.. దీనికి సమీపంలోనూ లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతం ఉంది. పాకిస్తాన్ నేవీ వార్ కాలేజీకి దగ్గరగానూ.. లాహోర్‌లోని ప్రసిద్ధ మోడల్ టౌన్ పార్క్‌కు సమీపంలో ఉన్న ఒక ప్రముఖ ప్రాంతంలో కూడా పేలుళ్లు సంభవించాయి. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) శిక్షణా విన్యాసాల సమయంలో పేలుళ్లు సంభవించాయి. దీనికి ఎవరు బాధ్యులు అనే విషయం ఇంకా తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా, లాహోర్, కరాచీ , సియాల్‌కోట్ ఎయిర్ పోర్ట్‌లను మూసేశారు.