మద్నూర్​లో వైభవంగా లక్ష్మీనారాయణ రథోత్సవం 

మద్నూర్​లో వైభవంగా లక్ష్మీనారాయణ రథోత్సవం 

పిట్లం, వెలుగు : మద్నూర్​లో జరుగుతున్న లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవాలు వైభవంగా సాగాయి. మంగళవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని పూజలు చేశారు. జుక్కల్​ నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే సొంత డబ్బులతో ఒక రోజు అన్నదానం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో జరుగుతున్న కుస్తీ పోటీలను తిలకించి విజేతలకు నగదు బహుమతులను అందజేశారు.