వీపున చంటిబిడ్డ.. ఎర్రటి ఎండలో వీధులు ఊడుస్తున్న తల్లి 

వీపున చంటిబిడ్డ.. ఎర్రటి ఎండలో వీధులు ఊడుస్తున్న తల్లి 

చేతిలో చీపురు, వీపున చిన్న పాప.. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్లను ఊడుస్తున్న ఈ మహిళ పేరు లక్ష్మీముఖి. ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్ష్మీముఖి వైరల్ గా మారింది. ఒడిషా మయూర్‌భంజ్‌ బర్దిపాడా మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాలుగా లక్ష్మీముఖి స్వీపర్‌గా పని చేస్తోంది. అక్కడ పని చేస్తుండగానే ఓ దినసరి కూలీకి ఇచ్చి కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేశారు. అయితే.. భర్త మద్యానికి బానిసై నిత్యం తాగి వచ్చి భార్య లక్ష్మీముఖితో గొడవ పడుతూ ఉండేవాడు. ఒకరోజు బిడ్డను కూడా అమ్మేయాలని ప్రయత్నించాడు. దీంతో భర్తకు ఎదురుతిరిగి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. భర్తకు దూరంగా స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటూ చంటి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటోంది.

ఇంటి దగ్గర బిడ్డను చూసుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో విధులకు వెళ్లే సమయంలో తనతో పాటు తీసుకెళ్తోంది. బిడ్డను వీపున కట్టుకుని రోడ్లను ఊడుస్తోంది. తన బిడ్డను ఇలా నడుముకు కట్టుకోవడం తనకేం ఇబ్బందిగా అనిపించడం లేదని, తన డ్యూటీ తాను చేస్తున్నానని  గర్వంగా చెబుతోంది. బిడ్డను వీపున కట్టుకుని వీధులు ఊడుస్తున్నా ఆ తల్లి కష్టానికి చాలామంది సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

నిఖత్ జరీన్ కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ సన్మానం

రాకేష్ టికాయత్‌ పై ఇంకు దాడి