లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు లైన్ క్లీయర్

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు లైన్ క్లీయర్

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు లైన్ క్లీయర్ అయ్యింది. ఎన్నికల క్రమంలో ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని మొదట సెన్సార్ బోర్డ్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై వర్మ కోర్టుకు వెళ్తానని ట్విట్టర్ లో తెలిపాడు. సెన్సార్ బోర్డు నిర్ణయంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాను సినిమాగా చూడాలి తప్ప రాజకీయం చేయవద్దని.. ఎన్నికలకు ముడి పెట్టొదంటు కామెంట్స్ చేశారు. మొత్తానికి సెన్సార్ బోర్డు ఈ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ చేసినట్లు సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపాడు వర్మ. మార్చి-29న లక్ష్మీస్ ఎన్టీఆర్ బ్రహ్మండమైన విడుదల అని తెలిపాడు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని సన్నివేశాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించామని సినిమా నిర్మాత రాకేష్‌ రెడ్డి తెలిపారు.  లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా… రాజకీయ పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా తీశారన్న ఆరోపణలల్లో వాస్తవం లేదన్నారు. పసుపు జెండాలను తప్ప, పార్టీలను చూపించలేదన్నారు. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తామన్నారు. సెన్సార్స్‌ క్లియరెన్స్‌ కూడా వచ్చిందని తెలిపిన ఆయన ఈ సినిమాకు క్లీన్ U సర్టిఫికెట్ వచ్చిందన్నారు.

ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఉందంటూ ఈసీకి ఫిర్యాదులు అందటం, నిర్మాతకు నోటీసులు జారీ చేసిన క్రమంలో నిర్మాత రాకేష్‌ రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు న్నికల సంఘం ఎదుట హాజరయ్యారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పై వస్తున్న అభ్యంతరాలపై నిర్మాత ఎంసీఎంసీ కమిటీకి వివరణ ఇచ్చారు. అయితే అంతకు ముందు రాకేష్‌ రెడ్డి తనకు వచ్చిన నోటీసులపై వాట్సాప్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన ఈసీ… వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజురు కావాలని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి వివాదాల మధ్యన వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మార్చి-29 వరకు ఆగాల్సిందే.