
లక్ష్మీస్ NTR సినిమాలోని పాటను రిలీజ్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం.. నీ రాకయే నాకు స్వర్గ తుల్యం..‘ అంటూ మొదలయ్యే సాంగ్ ఈ రోజు ఉదయం విడుదలైంది.. ఈ పాటలో లక్ష్మీ పార్వతి.. NTR జీవితంలోకి ఎలా వచ్చింది ఆ తరువాత జరిగిన సంఘటనలు ఏంటని ఒకే పాటలో చూపించారు వర్మ.
మొదటి నుంచి తనదే నిజమైన బయోపిక్ అంటూ ఊరిస్తున్న RGV ఈ రోజు సాంగ్ ను విడుదల చేయడంతో ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగింది. పాటను ప్రముఖ గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం పాడాగా.. కళ్యాణ్ మాలిక్ సంగీతాన్ని అందించారు. RGV దర్శకత్వంలో.. జీవీ నిర్మాణ సంస్థ ఈ సినిమా తెరకెక్కిస్తుంది.