ఢిల్లీలో మూడు రోజులు బోనాలు... జులై 20, 21, 22న నిర్వహణ

ఢిల్లీలో మూడు రోజులు బోనాలు... జులై 20, 21, 22న నిర్వహణ

నారాయణగూడ, వెలుగు: హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహని శ్రీమహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జులై 20, 21, 22 తేదీల్లో బోనాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చైర్మన్ జి.అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి పోసాని సతీశ్​ముదిరాజ్, మాజీ చైర్మన్లు కె.వెంకటేశ్​తో కలిసి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 20న ఫొటో ఎగ్జిబిషన్, 21న వివిధ కళారూపాలతో 1,000 మంది కళాకారులు ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ప్రదర్శన నిర్వహిస్తారని, 22న అమ్మవారి ఘటాల ఊరేగింపు, బోనాల జాతర జరుగుతాయని చెప్పారు. అలాగే,   లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం 118వ వార్షిక బోనాల మహోత్సవాల షెడ్యూల్ ను ప్రకటించారు.  ఆగస్టు 9, 10 తేదీల్లో ప్రధాన బోనాలు  నిర్వహిస్తామన్నారు.  

ఓల్డ్ సిటీ, వెలుగు: ఢిల్లీలో జులై 20, 21, 22వ తేదీల్లో నిర్వహించే బోనాలకు రావాలని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీమహంకాళి దేవాలయం చైర్మన్​అరవింద్ కుమార్ గౌడ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్​లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు.