మ్యాచ్ ఫిక్సింగ్ కామన్.. IPLపై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు

మ్యాచ్ ఫిక్సింగ్ కామన్.. IPLపై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు

Match Fixing In IPL: క్రికెట్ లవర్స్‌కి ఒకప్పుడు బాస్ లాంటివాడు, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ మీకు గుర్తున్నాడా? లండన్‌లో ఉంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ఆయన, రీసెంట్‌గా Wisden Cricket వారి 'The Scoop' పాడ్‌కాస్ట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇంకా బతికే ఉందంటూ ఒక బాంబ్ పేల్చారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 


ఐపీఎల్‌లో ఫిక్సింగా?: 
ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా అని అడిగితే.. లలిత్ మోడీ చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. నాకు తెలిసి ఐపీఎల్‌లో అలా జరిగే ఛాన్స్ లేదు.. ఎందుకంటే అక్కడ పైసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో ప్లేయర్‌కి వచ్చే జీతాలు, క్రేజ్, బ్రాండ్ వాల్యూ ముందు బుకీలు ఇచ్చే చిల్లర పైసలు ఎందుకు సరిపోతాయి? అంత లీగల్ మనీ, లైఫ్ సెటిలింగ్ కెరీర్ ఉన్నప్పుడు ఎవడైనా రిస్క్ తీసుకుంటాడా? అని ప్రశ్నించాడు. 

అసలు ఫిక్సింగ్ జరిగేది ఇక్కడే: 
పెద్ద పెద్ద లీగ్‌ల జోలికి వెళ్తే దొరికిపోతామని బుకీలు రూట్ మార్చారు. అసలు అవినీతి అంతా ఈ చిన్న చిన్న లోకల్ లీగ్‌లలోనే జరుగుతోందని లలిత్ మోడీ హింట్ ఇచ్చారు. ఈ చిన్న లీగ్‌లను కొంతమంది బిజినెస్‌మెన్లు పెడతారు.. అక్కడ సరైన పర్యవేక్షణ ఉండదు.. ఈ మ్యాచులు టీవీల్లో కూడా సరిగ్గా ప్రసారం కావు.. అంతా తెర వెనుక నడుస్తుందని వెల్లడించాడు. ఈ చిన్న లీగ్‌లు చాలా 'టాక్సిక్'.. అక్కడ జరిగేదంతా ప్యూర్ గా ఫిక్సింగే అని ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ ఆరోపించారు.  

బెట్టింగ్ మార్కెట్ చూస్తే మైండ్ బ్లాక్: 
మన దేశంలో సట్టా బాజీ (బెట్టింగ్) మార్కెట్ ఒక సీజన్‌కి కాదు.. రోజుకు అక్షరాలా రూ. 40,000 కోట్ల మేర ఉంటుందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పేర్కొన్నారు. టోటల్‌గా చూస్తే ఇది 40 బిలియన్ డాలర్ల నల్లధనం పరిశ్రమ.. క్రికెట్‌లో ప్రతి బాల్‌కి బెట్టింగ్ కట్టే అవకాశం ఉండటం వల్లే బుకీలు దీనిపై అంతలా ఆధార పడుతున్నారని చెప్పుకొచ్చారు. 

నా మాటల్ని కట్ చేయకండి: 
దయచేసి నా మాటల్ని కట్ చేయకండి, జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు అంటూనే లలిత్ మోడీ ఒక నిజాన్ని బయట పెట్టాడు. పెద్ద లీగ్‌లు (IPL లాంటివి) ప్లేయర్స్‌కి ఇచ్చే ఫైనాన్షియల్ సెక్యూరిటీ వల్ల సేఫ్‌గా ఉన్నా.. గల్లీలో పుట్టుకొస్తున్న చిన్న చిన్న లీగ్‌లు మాత్రం బుకీలకి అడ్డాగా మారుతున్నాయి. క్రికెట్ ఇప్పుడు చాలా 'అధునాతనమైన' స్కామ్‌లతో నడుస్తోందని వెల్లడించాడు.