చలో తిరుపతికి లంబాడీలు తరలిరావాలి: సంజీవ్ నాయక్

చలో తిరుపతికి లంబాడీలు తరలిరావాలి: సంజీవ్ నాయక్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హాథీరామ్ బావాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని పీఠాధిపతిగా బంజారాబిడ్డను నియమించాలనే డిమాండ్‎తో ఈ నెల 29, 30 తేదీల్లో చలో తిరుపతి చేపట్టామని, దీనికి పెద్ద సంఖ్యలో బంజారాలు తరలిరావాలని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు. 

8 అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‎లో సంజీవ్ నాయక్ ఆదివారం మాట్లాడారు. బంజారాజాతి గురువు హథీరామ్ బావాజీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో 30 లక్షల మంది లంబాడీల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ లంబాడీలకు మంత్రిపదవి ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.