భయపెట్టిస్తున్న కొత్త వేరియంట్.. 29 దేశాల్లో గుర్తింపు

భయపెట్టిస్తున్న కొత్త వేరియంట్.. 29 దేశాల్లో గుర్తింపు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో పరిస్థితులు మళ్లీ చక్కబడుతున్నాయి. ఈలోపు డెల్టా వేరియంట్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. డెల్టా వేరియంట్‌తో భారత్‌లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త కరోనా రకం ఆందోళన కలిగిస్తోంది. లంబ్డాగా పిలుస్తున్న ఈ వేరియంట్‌‌ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (వీవోఐ) అని కూడా అంటున్నారు. ఈ వేరియంట్‌ను 29 దేశాల్లో గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ప్రజారోగ్యంపై ఈ వేరియంట్ ప్రభావం ఎంతమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టులో పెరూలో లంబ్డా వేరియంట్‌ తొలిసారిగా బయటపడిందని, ఆ తర్వాత 29 దేశాలకు ఇది పాకిందని పేర్కొంది. లాటిన్ అమెరికా, అర్జెంటీనా, చిలీల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పింది. పెరూలోనైతే నమోదైన కరోనా కేసుల్లో 81 శాతం లంబ్డా వేరియంట్‌వేనని డబ్ల్యూహెచ్‌‌వో వివరించింది. చిలీలో గత 60 రోజుల్లో నమోదైన కరోనా కేసుల్లో 32 శాతం లంబ్డా వేరియంట్‌కు సంబంధించినవని తెలిపింది.