కశ్మీర్‌లో టెర్రర్ ఎటాక్.. లాన్స్‌నాయక్ సందీప్ వీరమరణం

కశ్మీర్‌లో టెర్రర్ ఎటాక్.. లాన్స్‌నాయక్ సందీప్ వీరమరణం

జమ్ముకశ్మీర్ సరిహద్దులో భారత ఆర్మీ, చొరబాటుదారుల మధ్య ఫైరింగ్ కొనసాగుతోంది. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్ లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ సైన్యం మరోసారి పక్కనపెట్టింది. ఇండియన్ ఆర్మీపై కాల్పులకు దిగింది. పాక్ సైనికుల కాల్పులను.. ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఐతే.. ఈ కాల్పుల్లో భారత సైనికుడు , లాన్స్ నాయక్ సందీప్ తప్పా ప్రాణాలు కోల్పోయినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… లైన్ ఆఫ్ కంట్రోల్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏరియాల్లో మాటువేసి భారత భూభాగంలోకి వచ్చేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఓ ప్రాంతంలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ హబ్ ను ఏర్పాటుచేసి… దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో ఉగ్రవాదులు కమ్యూనికేట్ చేసుకునేవిధంగా సహాయం అందిస్తోందని భారత సైన్యం తెలిపింది. ఈ కమ్యూనికేషన్ హబ్ సహాయంతో.. పీఓకే నుంచి.. లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా చొరబాట్లను పాకిస్థాన్ ఎంకరేజ్ చేస్తోందని ఇండియన్ ఆర్మీ చెప్పింది. ఐతే.. చొరబాట్లను నిలువరించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని.. అనుక్షణం గస్తీ కాస్తోందని చెప్పింది. సరిహద్దులో సైనికబలగాలను మోహరింపును పెంచినట్టు తెలిపింది.