వేల్పూర్ లో స్థల వివాదం ..షాపుల తొలగింపుతో ఉద్రిక్తత

వేల్పూర్ లో స్థల వివాదం ..షాపుల తొలగింపుతో ఉద్రిక్తత
  • భారీగా మోహరించిన పోలీసులు

బాల్కొండ, వెలుగు: వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం ఓ స్థల వివాదమై వీడీసీ, ఓ సామాజికవర్గం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నాలుగున్నర ఎకరాల స్థలంలో వీడీసీ పేరుపై ఎకరం భూమి ఉంది. ఆర్అండ్ బీ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఈ స్థలంపై ఇరువర్గాల మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తోంది.

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన మట్టిని ఆ స్థలంలో వేశారు. మట్టి కుప్పలను చదును చేయాలని కోరుతూ గ్రామస్తులు పలుమార్లు కోరారు. ఆ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల సీపీ కల్మేశ్వర్​ని కలిసి మట్టిని తీసేది లేదని చెప్పారు.

ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని వీడీసీ తేల్చిచెప్పడంతో ఆ వర్గం వారు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. గతంలో కాంపౌండ్ నిర్మాణం కోసం ఆ సామాజికవర్గం వారికి అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రూ.8 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ 144 అమలు చేస్తూ, ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపు ఉద్రిక్తత తర్వాత డీసీపీ జయరాం, ఆర్మూర్ ఏసీపీ జగదీశ్​చందర్ ఇరువర్గాలతో శాంతి చర్చలకు ఆహ్వానించడంతో పరిస్థితి కొంత వరకు సద్దుమణిగింది.