భూములిచ్చినా.. భవనాలు కడ్తలేరు?

భూములిచ్చినా.. భవనాలు కడ్తలేరు?

తెలంగాణ ట్రైబల్​ యూనివర్సిటీపై కేంద్రం చిన్నచూపు

ట్రైబల్​, ఉమెన్​ అండ్​ చైల్డ్​ వెల్ఫేర్​ మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు, వెలుగు : ములుగులో ఏర్పాటు చేయాల్సిన ట్రైబల్​ యూనివర్సిటీకి సంబంధించి సెంట్రల్​ గవర్నమెంట్ సవతితల్లి ప్రేమ చూపుతోందని, ఇప్పటికే 169 ఎకరాల భూమిని అప్పగించినా బిల్డింగుల నిర్మాణం స్టార్ట్​చేయడంలేదని ట్రైబల్​, ఉమెన్​ అండ్​ చైల్డ్​ వెల్ఫేర్​ మినిస్టర్​ సత్యవతి రాథోడ్​ ఆరోపించారు. ఏపీలో యూనివర్సిటీ ప్రారంభించి.. ఒక సెమిస్టర్​ కూడా కంప్లీట్​ అయ్యిందని చెప్పారు. గురువారం ములుగు మండలం జాకారంలో వైటీసీని సందర్శించిన ఆమె.. యూనివర్సిటీ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.  యూనివర్సిటీపై కొందరు కావాలని  రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ  కోసం 350ఎకరాలను రెడీ చేశామని, అందులో అసైన్డ్​ రైతుల నుంచి కొంత భూమి సేకరించవలసిఉందని, సంబంధిత రైతుల డిమాండ్లపై చర్చిస్తున్నామని వివరించారు.  ములుగులో పనులు పనులు మొదలు పెట్టి టెంపరరీగాక్లాసులు  ప్రారంభించాలని కోరారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్​ యూనివర్సిటీ అంశాన్ని తమ పార్టీ ఎంపీలు లేవనెత్తుతారని చెప్పారు. అంతకు ముందు ఆమె మల్లంపల్లిలోని విలేజ్​ పార్క్​ను ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​​ కుసుమ జగదీష్​, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్​ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. ములుగు జిల్లా కలెక్టర్​ ఆడిటోరియంలో అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు చీరెలను పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు తెరుస్తున్నందున ఎడ్యుకేషన్​ ఆఫీసర్లతో ఏర్పాట్లపై రివ్యూ చేశారు. ఐటీడీఏ పీవో హన్మంతు కె జెండగే, అదనపు కలెక్టర్​ ఆదర్శ్​సురభి, ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య,  జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి  తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ