బీజాపూర్​లో మందుపాతర పేలి  ఇద్దరు జవాన్లకు గాయాలు

బీజాపూర్​లో మందుపాతర పేలి  ఇద్దరు జవాన్లకు గాయాలు

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో సోమవారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఊసూరు బ్లాక్​లోని కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టుల కోసం కూంబింగ్​ చేస్తున్న ఎస్టీఎఫ్​ జవాన్లు నక్సల్స్ అమర్చిన మందుపాతరపై కాలు మోపారు.

తాన్ సింగ్, అమిత్​పాండే అనే ఇద్దరు జవాన్ల కాళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని బేస్​ క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించి, హెలిక్యాప్టర్​ లో బీజాపూర్​కు తీసుకెళ్లారు. కర్రెగుట్టల్లో అడుగడుగునా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు భద్రతాబలగాలకు సవాల్​గా మారాయి.