ఎర్రవల్లిలో భూముల రీసర్వే పూర్తి..

ఎర్రవల్లిలో భూముల రీసర్వే పూర్తి..

ములుగు/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రీ-సర్వే పూర్తయింది. డివిజనల్ రెవెన్యూ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు బానోతు సేవియా నాయక్, వంశీ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహించారు. ఒక్కో బృందంలో ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 12 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 

ఎర్రవల్లికి సంబంధించి 14.5 కిలోమీటర్లు, శివారు వెంకటాపూర్ కి సంబంధించి 12 కిలోమీటర్ల మేర సరిహద్దుల రీ-సర్వేను పూర్తి చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. త్వరలోనే ఈ రెండు గ్రామాల్లో ఎంజాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సర్వేకు ఒకరోజు ముందుగానే రైతులకు సమాచారమిచ్చి, వారి సమక్షంలో సర్వే చేపడతామని పేర్కొన్నారు.