శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు... పెద్ద ప్రమాదమే తప్పింది..!

శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై విరిగిపడ్డ కొండ చరియలు... పెద్ద ప్రమాదమే తప్పింది..!

ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారం ( సెప్టెంబర్ 24 ) శ్రీశైలం హైదరాబాద్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి.

శ్రీశైలం జలాశయం దిగువన రహదారి మార్గంలో కొండచరియలు విరిగి రోడ్డు మీద పడ్డాయి. అర్థరాత్రి సమయం కావడంతో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని రోడ్డుపై పడ్డ కొండచరియలు తొలగించారు.

ఇదిలా ఉండగా... తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వర్షాలు కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో అధికారులు హైఅలెర్ట్ గా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.