లంకా ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్ రిలీజ్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్, కొత్త రూల్స్ ఇవే!

లంకా ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్ రిలీజ్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్, కొత్త రూల్స్ ఇవే!

Lanka Premier League 2026: క్రికెట్ అభిమానులకు సరికొత్త టీ20 వినోదాన్ని అందించేందుకు లంక ప్రీమియర్ లీగ్ (LPL) 6వ ఎడిషన్ సిద్ధమైంది. రేపటి (జూలై 17) నుంచి ఆగస్టు 8 వరకు శ్రీలంక వేదికగా ఈ ప్రతిష్టాత్మక లీగ్ జరగబోతోంది. గత 2025 ఎడిషన్ శ్రీలంక బోర్డు టీ20 ప్రపంచకప్ వేదికల సన్నద్ధత కోసం రద్దు చేయడంతో.. ఈసారి సరికొత్త జోష్‌తో టోర్నీ తిరిగి రాబోతోంది. కొలంబో, దంబుల్లా, పల్లెకెలె వేదికలుగా మొత్తం 24 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో ఐదు ఫ్రాంచైజీలు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ జాఫ్నా కింగ్స్, గాలే గ్యాలెంట్స్ మధ్య కొలంబోలోని ఎస్ఎస్‌సీ (SSC) మైదానంలో తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది.   

ఐదు జట్లు: 
ఈసారి టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల యాజమాన్యాలు మారడంతో పాటు వాటి పేర్లు కూడా ఆసక్తికరంగా మారాయి. 
* జాఫ్నా కింగ్స్ (Jaffna Kings): (గతంలో జాఫ్నా టైటాన్స్).
* గాలే గ్యాలెంట్స్ (Galle Gallants): (గతంలో గాలే మార్వెల్స్).
* కొలంబో క్యాప్స్ (Colombo Kaps): (గతంలో కొలంబో స్ట్రైకర్స్).  
* క్యాండీ రాయల్స్ (Kandy Royals): (గతంలో క్యాండీ ఫాల్కన్స్).  
* దంబుల్లా సిక్సర్స్ (Dambulla Sixers): దినేష్ చండీమల్ కెప్టెన్సీలోని బలమైన జట్టు.  

సరికొత్త రూల్స్:
ఈ సారి లంక ప్రీమియర్ లీగ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు సరికొత్త నిబంధనలను తీసుకువచ్చారు.
* ఇంపాక్ట్ సబ్ (Impact Sub): ఐపీఎల్ తరహాలోనే ఎల్పీఎల్‌లో కూడా మొదటిసారిగా 'ఇంపాక్ట్ సబ్' నిబంధనను ప్రవేశపెడుతున్నారు.
* అండర్-23 రూల్: ప్రతి జట్టు తమ ప్లేయింగ్ XIలో కనీసం ఒక అండర్-23 (23 ఏళ్ల లోపు) ఆటగాడిని తప్పనిసరిగా ఆడించాల్సిందే. ఇంపాక్ట్ సబ్ వాడినప్పటికీ మైదానంలో ఒక అండర్-23 క్రీడాకారుడు ఉండాల్సిందే.  
* స్లో ఓవర్ రేట్ పెనాల్టీ: మ్యాచులు త్వరగా ముగిసేలా స్లో ఓవర్ రేట్ వేసే కెప్టెన్లకు కఠినమైన పెనాల్టీలు విధించనున్నారు.

ప్లేఆఫ్స్ వివరాలు: 
* లీగ్ దశలో ఐదు జట్లు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్‌లు (డబుల్ రౌండ్-రాబిన్) ఆడుతాయి. 
* లీగ్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.  
* క్వాలిఫైయర్ 1: పాయింట్ల పట్టికలో 1, 2 స్థానాల్లోని జట్ల మధ్య పోరు జరుగుతుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.
* ఎలిమినేటర్: 3, 4 స్థానాల్లోని జట్ల మధ్య పోరు జరుగుతుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
* క్వాలిఫైయర్ 2: క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేత మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కి వెళ్తుంది. 

ఎల్పీఎల్ 2026 పూర్తి షెడ్యూల్: 
* జూలై 17: జాఫ్నా కింగ్స్ vs గాలే గాలెంట్స్
* జూలై 18: క్యాండీ రాయల్స్ vs దంబుల్లా సిక్సర్స్, గాలే గాలెంట్స్ vs కొలంబో కాప్స్
* జూలై 19: దంబుల్లా సిక్సర్స్ vs జాఫ్నా కింగ్స్, కొలంబో కాప్స్ vs క్యాండీ రాయల్స్
* జూలై 21: దంబుల్లా సిక్సర్స్ vs క్యాండీ రాయల్స్
* జూలై 22: జాఫ్నా కింగ్స్ vs కొలంబో కాప్స్, దంబుల్లా సిక్సర్స్ vs గాలే గాలెంట్స్
* జూలై 23: క్యాండీ రాయల్స్ vs కొలంబో కాప్స్, గాలే గాలెంట్స్ vs జాఫ్నా కింగ్స్
* జూలై 25: గాలే గాలెంట్స్ vs క్యాండీ రాయల్స్, దంబుల్లా సిక్సర్స్ vs కొలంబో కాప్స్
* జూలై 26: క్యాండీ రాయల్స్ vs జాఫ్నా కింగ్స్, గాలే గాలెంట్స్ vs దంబుల్లా సిక్సర్స్
* జూలై 28: కొలంబో కాప్స్ vs జాఫ్నా కింగ్స్
* జూలై 29: గాలే గాలెంట్స్ vs క్యాండీ రాయల్స్, కొలంబో కాప్స్ vs దంబుల్లా సిక్సర్స్
* జూలై 30: జాఫ్నా కింగ్స్ vs క్యాండీ రాయల్స్
* ఆగస్టు 1: కొలంబో కాప్స్ vs గాలే గాలెంట్స్
* ఆగస్టు 2: జాఫ్నా కింగ్స్ vs దంబుల్లా సిక్సర్స్
* ఆగస్టు 5: క్వాలిఫయర్ 1 (మధ్యాహ్నం 3:00), ఎలిమినేటర్ (రాత్రి 7:30)
* ఆగస్టు 7: క్వాలిఫయర్ 2
* ఆగస్టు 8: ఫైనల్

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు: 
భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ టోర్నమెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network) ఛానెళ్లలో టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. అలాగే డిజిటల్ మొబైల్ వీక్షకులు ఫ్యాన్‌కోడ్ (FanCode) యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఆస్వాదించవచ్చు. శ్రీలంకలో SLTMobitel/PEOTV ద్వారా ఈ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి.