
తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు. హైదరాబాద్ ,సైబరాబాద్ లో పలువురు ఏసీపీ లకు బదిలీలు పోస్టింగ్ ఇచ్చారు.
బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్, మేడ్చల్ ఏసీపీగా సిహెచ్ శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మలక్ పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి. గాంధీనగర్ ఏసిపి గా ఏ యాదగిరి, ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసిపి గా ఏ సుధాకర్, కూకట్ పల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసిపి గా ఏసీ బాల గంగిరెడ్డి బదిలీ అయ్యారు.
పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్ నగర్ ఏసీపీగా ఎస్ లక్ష్మీనారాయణ, సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసిపి గా ఎస్ సుదర్శన్,
కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసిపిగా పి ప్రవీణ్ కుమార్, సిరిసిల్ల స్పెషల్ బ్రాంచి డీఎస్పీ మురళీకృష్ణ, సిరిసిల్ల డిసిఆర్బి డీఎస్పీ శ్రీనివాస్ రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ అయ్యారు.