
హైదరాబాద్ శివారులో SOT పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ SOT, శంషాబాద్ పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుపడిన డ్రగ్స్ విలువ రూ.2 కోట్ల 94 లక్షల 75 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 800 కేజీల గంజాయి కంటెయినర్ లో ఒరిస్సా నుంచి మహారాష్ట్ర హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నారని విచారణలో తేలింది.
కంటెయినర్ లో ఇంత పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తూ పట్టుపడటం ఇదే తొలిసారి. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.అరకు కు చెందిన మెయిన్ పేడ్లర్ రాము పరారీలో ఉన్నాడు. ఇతను పెద్ద మొత్తంలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. కమీషన్ ఎజెంట్ కం ట్రాన్స్పోర్టర్ గా ఒడిశా కి చెందిన సోమ్ నాథ్ ఖారా ఉన్నాడు.
అతను గతంలో గంజాయి రవాణా చేస్తూ అరెస్ట్ అయ్యాడు. మెయిన్ పెడ్లర్ కం రిసీవర్ సురేష్ మారుతి పాటిల్ పరారీలో ఉన్నాడు. DCM డ్రైవర్ లు సంజీవ్ విఠల్ రెడ్డి, హోల్లప్ప, సప్లయర్ సునీల్ ఖోస్లా, జాగ సునా లను అరెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.