
షాద్ నగర్ చటాన్ పల్లి బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. దీంతో ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అయితే స్పీడ్ గా వస్తున్న టాటా ఏస్ లారీని డీ కొనటంతో… క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. దీంతో క్యాబిన్ తొలగించి వారిని రక్షించారు స్థానికులు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.