Katrina Kaif Baby Bump: తల్లిదండ్రులు కాబోతున్నారు కత్రినా, విక్కీ.. నవంబర్‌లో బిడ్డ జననం!

 Katrina Kaif Baby Bump: తల్లిదండ్రులు కాబోతున్నారు కత్రినా, విక్కీ.. నవంబర్‌లో బిడ్డ జననం!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  ఈ వార్తలకు బలం చేకూర్చుతూ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వచ్చి ఒక పోస్ట్.. ఈ పుకార్లను మరింత పెంచేసింది.  లేటెస్ట్ గా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పలు కథనాలు వెలువడుతున్నాయి. కత్రినా గర్భవతి అని.. దీని ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్ 2025లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారని సమాచారం.

గతంలో కూడా ఇలాంటి పుకార్లు షికార్లు చేశారు. అయితే విక్కీ కౌశల్  'బ్యాడ్ న్యూజ్ '  సినిమా ట్రైలర్ లాంచ్ లో వాటిని ఖండించారు.  మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. నిజంగా గుడ్ న్యూస్ వస్తే.. మేము మీతో సంతోషంగా పంచుకుంటాం.. కానీ ప్రస్తుతం ఆ పుకార్లతో వాస్తం లేదని చెప్పుకొచ్చారు.  అయితే ఇటీవల కత్రినా వదులుగా ఉండే దుస్తుల్లో కనిపించడంతో ఆమె గర్భవతి అయ్యారన్న ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

కత్రినా, విక్కీ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని .. డెలివరీ అక్టోబర్, లేదా నవంబర్ లో ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై దంపతులు ఇద్దరూ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.  అయినా.. ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.  మరో వైపు బిడ్డ పుట్టిన తర్వాత కత్రినా లాంగ్ మెటర్నిటీ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. బిడ్డ ఆలనాపాలనా తానే దగ్గరుంది చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

►ALSO READ | OG Guns N Roses : పవర్ స్టార్ 'ఓజీ' పండగ.. 'గన్స్‌ అండ్‌ రోజెస్‌'తో ఫ్యాన్స్‌కు పూనకాలు!

వృత్తి పరంగా ఈ ఏడాది విక్కీ కౌశల్ బాగానే కలిసొచ్చింది. ఆయన నటించిన 'ఛావా' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇది ఈ సంవత్సరం అతి పెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచి ప్రేక్షకులను మెప్పించింది.  ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్ లతో కలిసి ' లవ్ & వార్ ' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో కలిసి' మెర్రీ కిస్మస్' లో కనిపించింది. విక్కీ, కత్రినా నుంచి గుడ్ న్యూస్ వినాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.