OG Guns N Roses : పవర్ స్టార్ 'ఓజీ' పండగ.. 'గన్స్‌ అండ్‌ రోజెస్‌'తో ఫ్యాన్స్‌కు పూనకాలు!

OG Guns N Roses : పవర్ స్టార్ 'ఓజీ' పండగ.. 'గన్స్‌ అండ్‌ రోజెస్‌'తో ఫ్యాన్స్‌కు పూనకాలు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న  మోస్ అవైటెడ్ మూవీ ఓజీ ( OG )  . ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ మాస్ సాంగ్  'గన్స్ అండ్ రోజెస్' ను విడుదల చేశారు. ఈ సాంగ్ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.

మొదట విడుదలైన 'ఓజీ' గ్లింప్స్‌లో హైలైట్ అయిన 'హంగ్రీ చీతా' పాటనే ఇప్పుడు పూర్తి స్థాయిలో 'గన్స్‌ అండ్‌ రోజెస్‌' పేరుతో తీసుకొచ్చారు. "ఈ పాటకు ఫిదా కావడమే కాదు, దీనికి మీరు అడిక్ట్ అయిపోతారు," అని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ పాటను అద్వితీయ, హర్ష రాయగా, సంగీత సంచలనం థమన్ తన పవర్ ఫుల్ బీట్స్‌తో మరోసారి అభిమానులను ఉర్రూతలూగించాడు. తమన్ అందించిన మాస్ బీజీఎం, పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిపి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ పాట సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది.

'ఓజీ' సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో, చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. సెప్టెంబర్ 18న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత హైప్ తీసుకొస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరో వైపు సెప్టెంబర్ 19న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి, సెప్టెంబర్ 20న ఒక గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, టికెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు ఉన్న పాన్-ఇండియా ఫాలోయింగ్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండగా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మాస్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయమంటున్నారు మేకర్స్. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..